close

తాజా వార్తలు

Published : 15/05/2020 22:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోతిరెడ్డిపాడుపై ఏపీ వివరణ కోరిన కృష్ణా బోర్డు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు జారీ చేసిన జీవోకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరింది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక, వివరాలను అందించాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ చేసిన ఫిర్యాదుపై స్పందించిన బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు హరికేష్ మీనా తెలంగాణ ప్రభుత్వ లేఖను జతపరుస్తూ ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

‘‘శ్రీశైలం నుంచి అదనంగా మూడు టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రతిపాదించిన కొత్త ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై తెలంగాణ గతంలో బోర్డుకు ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా ఫిబ్రవరి 5వ తేదీన ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరాం. ఈ నెల 13వ తేదీన మరో లేఖ రాసినప్పటికీ ఏపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు’’ అని లేఖలో పేర్కొంటూ ఏపీ ప్రభుత్వ వివరణ కోరింది.
ఇదీ చదవండి: ఎత్తిపోతల పథకంజీవోపై ఆరా



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని