కేటీఆర్‌ మెచ్చిన ఫుట్‌బాల్‌ ఫీట్‌..!
close

తాజా వార్తలు

Updated : 13/12/2020 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 కేటీఆర్‌ మెచ్చిన ఫుట్‌బాల్‌ ఫీట్‌..!

 

 ఇంటర్నెట్‌ డెస్క్‌ : మనదేశంలో క్రికెట్‌కు మించిన ఆట మరొకటి లేదని చాలామంది యువత భావిస్తుంటారు. క్రికెట్‌నే ఆరాధిస్తుంటారు. కానీ .. ప్రపంచం మొత్తం మీద ప్రజాదరణ అధికంగా ఉన్న ఆట మరొకటి ఉంది. ఈ పాటికే అర్థమయ్యింది కదూ అదేంటో.. అవును ఫుట్‌బాల్‌ గురించే.. కానీ..మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌తో పోలిస్తే ఫుట్‌‌బాల్‌కు ఆదరణ తక్కువే. ఎన్నో ఆటల్లో ప్రఖ్యాతి గాంచినప్పటికీ ఫుట్‌బాల్ విషయంలో మనం వెనుకబడి ఉన్నామనే చెప్పాలి. అందుకు అనేక కారణాలు ఉండొచ్చు. 

  కానీ నార్వే దౌత్యవేత్త ఎరిక్‌ సోల్హెమ్‌ షేర్‌ చేసిన ఈ వీడియోను చూస్తే మనమూ ఏదో ఒకరోజు ఫుట్‌బాల్‌లో సత్తాచాటుతామని, ఫిఫా ప్రపంచకప్‌ గెలుస్తామన్న నమ్మకం కచ్చితంగా కలుగుతుంది. అయితే నైపుణ్యం కలిగి గ్రామీణ ప్రాంతాల్లో ఉండిపోయిన యువతను ప్రోత్సహించినపుడే అది సాధ్యమవుతుంది.  ఎరిక్‌ సోల్హెమ్‌ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు.  ‘ఈ వీడియో చూడండి. భారత్‌ ఎందుకు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ గెలవలేదు?’అని ఆయన ట్వీట్‌ చేశారు.  ఈ వీడియోలో ఆటగాళ్లు మూడు సార్లు ప్రయత్నించినా.. గోల్‌ కీపర్‌ బాల్‌ను అడ్డుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.   ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.  ఈ వీడియోను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ లైక్‌ చేశారు..  అధిక సంఖ్యలో కామెంట్లు, లైక్‌లు వచ్చిన ఆ ఫుట్‌బాల్‌ ఫీట్‌ను మీరు చూడండి..Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని