close

తాజా వార్తలు

Published : 24/11/2020 10:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరేళ్ల నగరాభివృద్ధి మీ కళ్లముందే!:కేటీఆర్‌

ప్రత్యేక వీడియో విడుదల చేసిన మంత్రి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గడిచిన ఆరేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో జంట నగరాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. దీని కోసం ప్రతి ఒక్కరూ డిసెంబరు 1వ తేదీన జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రత్యేక వీడియోను మంత్రి ట్విటర్‌లో పోస్టు చేశారు. 

ఆరేళ్ల నగర అభివృద్ధి మీ కళ్ల ముందే అంటూ ప్రారంభమైన ఈ వీడియోలో తెరాస ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నగరంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా, తాగునీటి సరఫరా, మెరుగైన ప్రజారవాణ, రహదారుల నిర్మాణం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, బస్తీ దవాఖానాలు, మెరుగైన పోలిసింగ్‌, అన్నపూర్ణ రూ.5కే భోజనం, చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి, అడవుల పెంపకం, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేశారు. Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని