close

తాజా వార్తలు

పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌

కటక్‌: ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌(ఎల్‌టీటీ) ఎక్స్‌ప్రెస్ కటక్‌ సమీపంలోని నిర్గుండి దగ్గర పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఉదయం 7గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న గూడ్స్‌ రైలును వెనక భాగంలో ఢీకొట్టడంతో ఎక్స్‌ప్రెస్‌లోని మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు అలుముకొని ఉండడం గమనార్హం. 

క్షతగాత్రులను కటక్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ దారిలో వెళ్లాల్సిన మరో ఐదు సర్వీసుల మార్గాన్ని మళ్లించినట్లు రైల్వే విభాగం వెల్లడించింది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.