లాల్‌బాగ్చా రద్దు: 87 ఏళ్లలో తొలిసారి
close

తాజా వార్తలు

Published : 01/07/2020 18:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాల్‌బాగ్చా రద్దు: 87 ఏళ్లలో తొలిసారి

కరోనా ఎఫెక్ట్

ముంబయి: హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్సో.. ముంబయి వాసులకు ‘లాల్‌బాగ్చా రాజా’ గణపతీ అంతే! కానీ, కరోనా ప్రభావం ఆయన మీద కూడా పడింది. ఈసారి లాల్‌బాగ్చా రాజా ఉత్సవాలకు అక్కడి ప్రజలు దూరం కానున్నారు. వైరస్‌ ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది లాల్‌బాగ్ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు బుధవారం నిర్వాహకులు నిర్ణయించారు. 87 ఏళ్ల చరిత్రలో ఉత్సవాలను రద్దు చేయడం ఇదే తొలిసారి.  

‘పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ఈ ఏడాది విగ్రహాన్ని ప్రతిష్టించడం లేదు’ అని లాల్‌బాగ్ గణేశ్ మండలి కార్యదర్శి సుధీర్‌ సాల్వి వెల్లడించారు. ముంబయిలోని లాల్‌బాగ్‌ వద్ద ఏటా గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున హాజరవుతుంటారు. అయితే ఈ ఏడాది పండగ సమయంలో రక్తదాన, ప్లాస్మా థెరపీ శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని నిర్వాహకులు వెల్లడించారు. 

కాగా, కరోనా మహమ్మారి మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న తరుణంలో వివిధ మత వర్గాలకు చెందిన ప్రజలు నిగ్రహాన్ని పాటించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్రం పురోగతిని సాధిస్తున్నప్పటికీ..ఈ సంక్షోభానికి ఇంకా అడ్డుకట్టపడలేదని, ప్రజలు నిబంధనలను కచ్చితంగా పాటించాలని అభ్యర్థించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని