close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 15/01/2020 23:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంక్రాంతికి ముగిసింది.. ఉగాదికి మొదలవుతుంది

హైదరాబాద్‌: నాని కథానాయకుడిగా ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వి’. సుధీర్‌బాబు, నివేదా ధామస్‌, అదితి రావు హైదరీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో నాని వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కాగా, సంక్రాంతి రోజుతో ‘వి’లో తన నటనకు సంబంధించి చిత్రీకరణ పూర్తయిందని నాని తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘సంక్రాంతి రోజు ముగిస్తున్నాం. ఉగాది రోజు మొదలెడదాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు. 

‘అష్టాచమ్మా’, ‘జెంటిల్‌మెన్‌’ తర్వాత నాని-ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అమిత్‌ త్రివేది సంగీతం సమకూరుస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.