close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120024502 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => o7CALg0XcCw [video_short_link] => o7CALg0XcCw [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-02-20 19:53:57.51246 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

పర్యాటకుల ప్రాణాలకు ‘రక్షక్‌’లా లైఫ్‌గార్డ్‌

విశాఖపట్నం: విశాఖ సాగర తీరాన  ఓ లైఫ్‌ గార్డ్‌ పర్యాటకుల ప్రాణాలను కాపాడుతోంది. సముద్ర స్నానాలకు ముచ్చటపడి, రాకాసి అలలకు బలవుతున్న వారి వద్దకు వెళ్లి వారిని ఒడ్డున చేరుస్తోంది. గజ ఈతగాళ్ల కన్నా మూడు రెట్లు ఎక్కువ వేగంతో పనిచేస్తున్న ఆ లైఫ్‌ గార్డు గురించి తెలుసుకుందాం.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, సాగర తీరాన్ని చూడగానే ఆనందంతో స్నానానికి దిగే వారు చాలా మంది ఉంటారు. ఆ సమయంలో కాస్త అజాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. రాకాసి అలలు వారిని మింగేస్తాయి. కొన్ని సార్లు గజ ఈతగాళ్లు వారి శక్తి మేర యత్నించినా వాళ్లను కాపాడలేకపోవచ్చు. అలాంటి వారి కోసమే.. విశాఖకు చెందిన సైఫ్‌ సీస్‌ అనే అంకుర సంస్థ ఓ సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఓ కృత్రిమ లైఫ్‌ గార్డును రూపొందించింది. అలల మీది నుంచి దూసుకెళ్లి సముద్రంలో ఎవరైనా మునుగుతుంటే ఈ పరికరం వారిని కాపాడుతుంది. పూర్తిగా రిమోట్‌ సహయంతో పనిచేసే ఈ పరికరం సెకనుకు మూడు మీటర్ల వేగంతో ఆపదలో ఉన్న వ్యక్తి వద్దకు చేరుకుంటుంది. ఇటీవల లఖ్‌నవూలో జరిగిన డిఫెన్స్‌ ఎక్స్‌పోలో ఈ ఆవిష్కరణ ప్రధాని మోదీ దృష్టిని సైతం ఆకర్షించింది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశను దాటుకున్న ఈ పరికరం ఇప్పుడిప్పుడే సాగర తీరాన సేవలందిస్తోంది. 

తాము నిరంతరం తీరాన్ని పర్యవేక్షిస్తున్నా ఒక్కోసారి మునిగిపోతున్న వారి వద్దకు అనుకున్న సమయానికి చేరుకోలేమని, ఈ కృత్రిమ లైఫ్‌గార్డ్‌ అయితే మరింత వేగంగా వారిని రక్షిస్తుందని లైఫ్‌గార్డులు చెబుతున్నారు. సాగార తీరాలే కాక నదులు, రిజర్వాయర్ల వద్ద కూడా ఈ పరికరాన్ని వినియోగించొచ్చని సైఫ్ సీస్‌ సంస్థ చెబుతోంది. 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.