close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120024901 [video_srlno] => 1 [video_type] => 4 [video_link] => 21022020-LionsRoundup.mp4 [video_short_link] => 21022020-LionsRoundup.mp4 [created_by] => [created_date] => [modified_by] => 9030304 [modified_date] => 2020-02-21 20:12:34.462913 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

మృగరాజు ‘మే ఐ కమిన్‌’ అంటే..వైరల్‌ వీడియో

దిల్లీ: జూ బోనులో ఉండే వన్య ప్రాణులను చూడటం ఒకెత్తయితే, సఫారీలో వాటిని మరింత దగ్గరగా చూస్తుంటే వచ్చే ఆ మజాయే వేరు. ప్రకృతి సిద్ధమైన ఆవాసాల్లో పులులు, సింహాలు వంటి జంతువుల సహజ జీవనశైలిని చాలా దగ్గర నుంచి గమనించే వీలు సఫారీ పర్యటనలో మాత్రమే ఉంటుంది. అయితే దీనికి షరతులు వర్తిస్తాయి అంటోంది ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఓ వీడియో.

ఇందులో ఒక సఫారీ కారు, దానికి రక్షణగా మరో రెండు వాహనాలు ఉన్నాయి. కొన్ని క్షణాల తర్వాత ఓ సింహం కారు మీదకు ఎక్కి కూర్చుంది. దానికి తోడుగా మరో రెండు సింహాలు అక్కడకు వచ్చాయి. కారుపై కూర్చొన్న ఆ సింహం అద్దాన్ని కొరికింది... అనంతరం కారు డోరు తీయటానికి ప్రయత్నించింది... కానీ అది తెరుచుకోలేదు. ఇలా కాసేపు గడిచిన తరువాత డ్రైవర్‌ కారును మెల్లగా వెనుకకు నడపటం మొదలుపెట్టాడు. ఇక బోర్‌ కొట్టిందో ఏమో... ఆ సింహం కూడా దిగిపోయి తన దారి తాను చూసుకుంది. కారు తలుపు తెరుచుకోలేదు కాబట్టి సరిపోయింది లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది. 
Video Source:Reddit



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.