close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 15/05/2020 23:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యూహం

అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 17తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో ప్రగతి భవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలను పరిశీలించి రాష్ట్రంలో వ్యూహం ఖరారు చేస్తామన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు కొనసాగించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఏసీల విక్రయ దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఆటోమొబైల్‌ షోరూంలు, ఆటో మొబైల్‌ విడిభాగాల అమ్మకపు దుకాణాలకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.

‘‘ కరోనా వైరస్‌ హైదరాబాద్‌లోని 4 జోన్లకే పరిమితమయింది. ఎల్బీనగర్‌, మలక్‌పేట, చార్మినార్‌, కార్వాన్‌ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్‌ కేసులున్నాయి. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వలస కూలీలు కూడా హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు. పాజిటివ్‌ కేసులున్న 4 కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. కరోనా లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తున్నాం. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా సోకినప్పటికీ కోలుకున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి శాతం కేవలం 2.38 మాత్రమే. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ’’ అని కేసీఆర్‌ అన్నారు.

కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదని కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు నడుస్తాయని చెప్పారు. ‘‘ వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విమానాల ద్వారా వచ్చే వారికి పరీక్షలు నిర్వహించాలి. విమానాశ్రయాల్లో దిగే వారిని ప్రత్యేక బస్సుల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు పంపించాలి. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. నెలకు 5 సార్లు సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ చేయాలి. చెత్తా చెదారం తొలగించడంతోపాటు దోమలు రాకుండా ఫాగింగ్‌ చేయాలి. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి’’ అని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సంబంధించి నెలవారీగా నిర్ణయించిన నిధులు విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 20 నుంచి తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల, కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌,సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు , వైద్య ఆరోగ్యశాఖ, పురపాలకశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.