రాష్ట్రాన్ని వదిలి వెళ్లకండి : ఉద్ధవ్‌ ఠాక్రే
close

తాజా వార్తలు

Published : 29/03/2020 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రాన్ని వదిలి వెళ్లకండి : ఉద్ధవ్‌ ఠాక్రే

వలస కార్మికులకు మహారాష్ట్ర సీఎం విజ్ఞప్తి


ముంబయి :  ‘రాష్ట్రాన్ని వదిలి వెళ్లకండి..’ అంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వలస కార్మికులకు విజ్ఞప్తి చేశారు.  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న ఈ సమయంలో ఎక్కడి వారు అక్కడే ఉండాలని కోరారు. వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే రెవెన్యూ, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. వలస కార్మికులకు ఏదైనా సహాయం అవసరమైతే.. స్థానిక అధికారులు, జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.

మరోవైపు మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దేశంలో వైరస్‌ బాధితుల సంఖ్య ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. ఇప్పటివరకూ 193 మంది వైరస్‌ బారిన పడగా.. ఆరుగురు మృతి చెందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని