close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. పెట్టుబడులకు దివ్య ఔషధం

హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ సెల్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి వ్యాధుల చికిత్స (క్యూరేటివ్‌ థెరపీ) సంస్థ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. తెలంగాణ ఫార్మా రంగం విలువను ఈ దశాబ్దంలో రూ. 7 లక్షల కోట్లకు పెంచడం, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. రాష్ట్రంలో జీవశాస్త్రాలు, ఔషధ రంగాల అభ్యున్నతి కోసం బయోటెక్‌ హబ్‌ (బి-హబ్‌)ను నెలకొల్పుతాం. త్వరలో ఔషధనగరికి శంకుస్థాపన చేస్తాం. భూముల కేటాయింపులు ప్రారంభిస్తాం’’ అని కేటీఆర్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తవ్వి తలకెత్తుతున్నారు!

గ్రానైట్‌ గనుల ఖిల్లా ప్రకాశం జిల్లాలో గనుల శాఖ అధికారుల తనిఖీలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇతర జిల్లాల నుంచి అధికారులను పెద్ద సంఖ్యలో రప్పించి ఈ తనిఖీలు చేపడుతున్నారు. రూ.వందల కోట్ల మేర ఉల్లంఘనలు జరిగాయంటూ తాఖీదులు జారీ చేస్తుండటంతో లీజుదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల నేతలకు చెందిన గ్రానైట్‌ క్వారీలే లక్ష్యంగా ఈ తనిఖీలు సాగుతున్నాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. లీజుకు ఇచ్చిన గనుల్లో తవ్వకాలను ఎప్పటికప్పుడు పరిశీలించి పర్మిట్లు జారీ చేసే అధికారులు, ఇప్పుడు వాటిలో పెద్దఎత్తున అక్రమాలు ఉన్నాయంటూ ప్రకటిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 6 రోజుల్లో మాస్కుల కర్మాగారం

కేవలం 10 రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించిన చైనా ఇప్పుడు ఆరు రోజుల్లో ఓ మాస్కుల తయారీ కర్మాగారాన్ని సిద్ధం చేయబోతోంది. కొవిడ్‌-19 (కరోనా) ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. బీజింగ్‌లోని ఓ పారిశ్రామిక భవంతిని కేవలం ఆరు రోజుల్లో కర్మాగారంగా తీర్చిదిద్దనుంది. దీనిలో రోజుకు 2.50 లక్షల మాస్కుల్ని ఉత్పత్తి చేయనున్నారు. కర్మాగారం పనులు సోమవారం మొదలయ్యాయి. శనివారం నాటికి అందుబాటులోకి వచ్చేలా షిఫ్టుల వారీగా కార్మికులు పనిచేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కారిడార్‌లో కదలికేదీ?

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌(వీసీఐసీ) పనులు నిలిచిపోయాయి. 2017లో ప్రారంభించిన ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా.. సాధారణ ఎన్నికల తర్వాత పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇప్పటి వరకూ చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు పూర్తికి ముందుకు రావడంలేదు. గడువును మరో అరు నెలలు పొడిగించినా గుత్తేదారుల నుంచి స్పందన లేదు. అలాగే అధికశాతం భూసేకరణ జరగకపోవడంతోనూ పనులు చేపట్టడానికి కుదరడంలేదు. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) రుణంతో వీసీఐసీ పనులను చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భాజపాలో జేవీఎం(పి) విలీనం

ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ మరాండీ భాజపాలో చేరారు. తన పార్టీ ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా (జేవీఎం-ప్రజాతాంత్రిక్‌)ను కమలదళంలో విలీనం చేశారు. సోమవారం రాంచీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జె.పి. నడ్డా సమక్షంలో బాబూలాల్‌ కాషాయం కండువా కప్పుకొన్నారు.బాబూలాల్‌ 2000 నుంచి 2003 వరకు ఝార్ఖండ్‌ రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్నారు. 2006లో భాజపా నుంచి బయటకొచ్చి జేవీఎం(పి)ని  స్థాపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మరుగుదొడ్లకు వెళ్తారని...మంచినీళ్లు తాగనివ్వరు

కళాశాలలు, పాఠశాలలను అపార్టుమెంట్లలో నిర్వహిస్తున్నారని, వాటిలో సరైన సౌకర్యాలు లేవని, పిల్లలు మరుగుదొడ్లకు వెళ్తారని మంచినీళ్లు తాగకుండా వారిని కట్టడి చేస్తున్నారని... పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ (ఎస్‌ఈఆర్‌ఎంసీ) వెల్లడించింది. వైస్‌ ఛైర్‌పర్సన్‌ విజయశారదారెడ్డి, కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డితో కలిసి కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు విజయవాడలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ విద్యాసంస్థల దుస్థితిని వివరించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 260 పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించిన తనిఖీల్లో అనేక లోపాలు వెలుగుచూశాయని ఆయన వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కంబళ వీరుడికి సత్కారం

కర్ణాటక కంబళ వీరుడు శ్రీనివాసగౌడను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి యడియూరప్ప బెంగళూరులోని విధానసౌధలో ఘనంగా సత్కరించారు. ఆయన సేవలు భారత క్రీడారంగానికి ఉపయుక్తం కావాలని ఆకాంక్షించారు. మరోవైపు ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేలా సోమవారం బెంగళూరులోని సాయ్‌ శిబిరానికి హాజరు కావాలని శ్రీనివాసగౌడకు కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) సూచించింది. ప్రస్తుతం కర్ణాటక కరావళి ప్రాంతంలో నిర్వహిస్తున్న కంబళ పోటీల్లో పాల్గొనేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నందున మరో నెల పాటు రాలేనని గౌడ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మిస్టర్‌ ఇండియా రణ్‌వీర్‌.. మొగాంబో షారుఖ్‌!

‘మొగాంబో ఖుష్‌ హువా..’ - అమ్రిష్‌ పురి చెప్పిన ఈ డైలాగ్‌ వింటే వెంటనే ‘మిస్టర్‌ ఇండియా’ గుర్తుకొచ్చి మనసంతా ఖుషీ  అవుతుంది. 33 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా, అందులో అనిల్‌ కపూర్‌, శ్రీదేవి మధ్య కెమిస్ట్రీ, మొగాంబోగా అమ్రిష్‌ పురి నటన.. ఏదీ మర్చిపోలేం. మిస్టర్‌ ఇండియా అనే సూపర్‌ హీరో ప్రధాన పాత్రగా శేఖర్‌ కపూర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ‘మిస్టర్‌ ఇండియా’ మాయాజాలం వెండితెరపై కనువిందు చేయనుంది. అదీ ఏకంగా మూడు చిత్రాల్లో!. మిస్టర్‌ ఇండియాగా రణ్‌వీర్‌ సింగ్‌, మొగాంబోగా షారుఖ్‌ ఖాన్‌ నటించే అవకాశాలున్నాయని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పదికి పడిన కోహ్లి

భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పదో స్థానానికి పడిపోయాడు. కోహ్లి (673 పాయింట్లు)ని వెనక్కి నెట్టి ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (687) తొమ్మిదో స్థానంలో నిలిచాడు. సోమవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (823) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌ (810) మూడో స్థానంలో ఉన్నాడు. పిక్క గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 11వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 12వ స్థానంలోనే ఉన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 20 నిమిషాల్లో 25 కిలోల బంగారం దోపిడీ

పంజాబ్‌లోని లుధియానాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఐఐఎఫ్‌ఎల్‌ రుణ సంస్థలోకి చొరబడి సిబ్బందిని బెదిరించి 20 నిమిషాల వ్యవధిలో 25 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 10.15 సమయంలో లుధియానాలోని ఐఐఎఫ్‌ఎల్‌ రుణ సంస్థ కార్యాలయంలోకి ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు వచ్చారు. బయట మరొకరిని కారులో సిద్ధంగా ఉంచారు. సిబ్బందిని బెదిరించి తాళాలు తీసుకున్న దుండగులు వారిని తాళ్లతో బంధించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.