close

తాజా వార్తలు

Updated : 01/04/2020 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

8 రోజుల్లోనే ఆర్థికలోటు వచ్చిందా: కోమటిరెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు కాంగ్రెస్‌ పార్టీ తన వంతు సహకారం అందిస్తుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అయితే ధనిక రాష్ట్రం అని చెబుతూనే నేడు ఆర్థిక లోటు పేరుతో ఉద్యోగుల పొట్టమీద కొట్టడం సరైన పద్ధతికాదని.. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఆర్థిక లోటు పేరుతో ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతూ నిర్ణయం తీసుకున్నారని.. కేవలం 8 రోజుల లాక్‌డౌన్‌లో రాష్ట్రం ఆర్థిక లోటులో కూరుకుపోయిందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటివరకు కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పుకునే సీఎం కేసీఆర్‌.. ఇపుడు ఆర్థిక లోటు అనటం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. లాక్‌డౌన్‌ కాలంలో ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు. ఆయన బాటలోనే ప్రైవేటు సంస్థలు నడిస్తే ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు. పింఛన్‌తో జీవితాన్ని గడుపుతున్న వారు తాజా నిర్ణయంతో రోడ్డున పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని క్రమశిక్షణ లేక అప్పుల రాష్ట్రంగా మార్చారని కోమటిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల జీతాల్లో కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ మరోసారి సమీక్షించాలని.. ప్రస్తుత ఆర్థిక లోటుపై వారంలోగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని