‘అర్చకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి’
close

తాజా వార్తలు

Published : 13/09/2020 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అర్చకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి’

ఏపీ ప్రభుత్వానికి ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌

దిల్లీ: ఏపీలో హిందూ ఆలయాలకు వెళ్లే పేద భక్తులను లూటీ చేయడం ఆపాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. భగవంతుణ్ణి సామాన్యుడికి దూరం చేసే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతోందని ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తితిదే బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌ సతీసమేతంగా ఎందుకు పాల్గొనట్లేదని ఆయన ప్రశ్నించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ‘సనాతన స్వదేశీ సేన’ సంస్థను స్థాపించామన్నారు. హిందూ దేవాలయాలను పరిరక్షించడంతో పాటు అర్చకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5వేలు అందుకున్న పాస్టర్లలో చాలా ధ్రువపత్రాలు హిందువులగానే ఉన్నాయని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ రమ్మంటేనే తాను వైకాపాలోకి వచ్చానని ఓ ప్రశ్నకు సమాధానంగా రఘురామకృష్ణరాజు చెప్పారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని