ఎంపీ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌
close

తాజా వార్తలు

Updated : 05/03/2020 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంపీ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

హైదరాబాద్‌: మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా జన్వాడలో అనుమతి లేకుండా డ్రోన్‌ వాడారనే కారణంతో రేవంత్‌తో పాటు అతని సోదరుడు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్‌తో పాటు ఆయన సోదరుడు, అనుచరులను నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేసి ఉప్పర్‌పల్లి న్యాయస్థానానికి తీసుకెళ్లారు.

అంతకుముందు దిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్‌ను పోలీసులు అక్కడి నుంచి నార్సింగ్‌ పీఎస్‌కు తీసుకొచ్చారు. పీఎస్‌లో మాదాపూర్‌ ఏసీపీ, నార్సింగి సీఐ ఆయన్ను ప్రశ్నించారు. అనంతరం అరెస్ట్‌ చేసి న్యాయస్థానానికి తరలించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని