close
Array ( ) 1

తాజా వార్తలు

కంది రైతుల సమస్యలు తీర్చాలి: రేవంత్‌

హైదరాబాద్‌: కంది రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కంది రైతులు రోడ్కెక్కే పరిస్థితులు వచ్చాయని, అలాంటప్పుడు రైతు సమన్వయ సమితులు ఏం చేస్తున్నాయని ఆయన  ప్రశ్నించారు. రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించకపోతే ‘రైతు గోస’ పేరుతో తమ కార్యాచరణను ప్రకటిస్తామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.ఈ మేరకు కందుల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు. కంది విస్తీర్ణం, దిగుబడిని అంచనా వేయడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రైవేటు వ్యాపారుల సూచనల మేరకే ప్రభుత్వం రైతుల వద్ద కందులు కొనడం లేదని ఆయన ఆరోపించారు. తక్షణమే పరిస్థితిని సీఎం సమీక్షించాలని లేఖలో కోరారు. ట్రంప్‌ విందుకు హాజరై ఇవాంక యోగక్షేమాలు తెలుసుకోవడం కాకుండా రాష్ట్రంలోని కంది రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని రేవంత్‌ వ్యాఖ్యానించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.