
తాజా వార్తలు
పవిత్ర స్థలాల్లో చిత్రీకరణలపై ఆంక్షలు
చర్యలు తీసుకోనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
భోపాల్: రాష్ట్రంలోని పవిత్రస్థలాలు, ఆలయాల్లో జరిగే షూటింగులను వీడియో తీయించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం అధికారులను ఆదేశించింది. పవిత్రస్థలాల్లో అభ్యంతరకర సన్నివేశాల చిత్రీకరణను కట్టడి చేసేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో సంబంధిత డైరెక్టర్, నిర్మాతలపై చర్యలు తీసుకుంటామన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శితమవుతున్న ‘ఎ సూటబుల్ బాయ్’ వెబ్‌సిరీస్‌లో ఆలయంలో చిత్రీకరించిన కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని భాజపా నాయకులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు గౌరవ్ తివారీ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఈ ఫిర్యాదుపై తక్షణం స్పందించింది. నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు మోనికా షెర్గిల్, అంబికా ఖురానాపై సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు నరోత్తమ్ మిశ్రా ఒక వీడియో ప్రకటనలో తెలిపారు.
ఈ వెబ్‌సిరీస్‌లో ఆరు భాగాలుండగా ప్రముఖ డైరక్టర్ మీరా నాయర్ దర్శకత్వం వహించారు. ఆమె ఇంతకు ముందు ‘సలామ్ బాంబే’, ‘మాన్సూన్ వెడ్డింగ్’, ‘ది నేమ్ సేక్’ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- అమిత్ షాతో కీలక అంశాలు చర్చించిన జగన్
- వీరే ‘గబ్బా’ర్ సింగ్‌లు..!
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- ‘కేరింత’ హీరోపై కేసు నమోదు
- రహానె వ్యూహం.. కుర్రాళ్ల పోరాటం... అద్భుతం
- కరోనా భయంతో.. అలా చేశాడట..!
- మాటల్లో చెప్పలేను: రహానె
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
ఎక్కువ మంది చదివినవి (Most Read)
