close

తాజా వార్తలు

Published : 05/08/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధోనీ భాయ్‌ నన్నెలా టీజ్‌ చేస్తాడో తెలుసా!

ఇంటర్‌నెట్ డెస్క్‌‌: టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ తనను ముసలివాడిగా పిలుస్తాడని పొడగరి పేసర్‌ ఇషాంత్‌ శర్మ అన్నాడు. అతడే కాదు తన సతీమణి ప్రతిమా సింగ్‌ సైతం వయసు, దేహాన్ని చూపించి జోక్‌ చేస్తుందని పేర్కొన్నాడు. కాగా ఈ మధ్యే లంబూ 32వ వసంతంలోకి అడుగుపెట్టడం గమనార్హం. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో ఛాట్‌షోలో అతడీ విషయాలను పంచుకున్నాడు.

‘వాస్తవంగా మానసికంగా నా వయసు 32. కానీ నేను అంతకన్నా ఎక్కువ వయసున్న వాడిగా కనిపిస్తాను. అందుకే నా వయసుపై జోక్‌ చేసేందుకు నా భార్య బుద్ధా అని పిలుస్తుంది. మహీభాయ్‌ సైతం అంతే. ముసలాయనా.. ఎలా వున్నావు? అని సందేశాలు పంపిస్తుంటాడు. అతడికి నా వయసు 32 మాత్రమే అని జవాబిస్తుంటాను. అప్పుడతను ‘బిడ్డా.. నీ వయసు 32. కానీ నీ శరీరమేమో 52లా ఉంటుంది’ అని బదులిస్తుంటాడు’ అని ఇషాంత్‌ చెప్పాడు. 

ప్రస్తుతం టీమ్‌ఇండియా పేస్‌ దళంలో ఇషాంత్‌ది కీలక పాత్ర. ఇప్పుడున్న జట్టులో అందరికన్నా ఎక్కువ టెస్టు అనుభవం అతడికే ఉండటం గమనార్హం. త్వరలో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం లంబూ కసరత్తులు మొదలు పెట్టాడు. సాధన చేస్తున్నాడు. తన బౌలింగ్‌లో మరింత వైవిధ్యం పెంచుకున్నాడు. యూఏఈలో దిల్లీ జట్టు తరఫున అతడు ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆత్రుతగా ఎదరుచూస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.