close

తాజా వార్తలు

Published : 28/11/2020 23:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరణ్‌ క్షమాపణపై స్పందించిన భండార్కర్‌

ముంబయి: ఇద్దరు నిర్మాతల మధ్య నెలకొన్న ‘బాలీవుడ్‌ భార్యలు’ వ్యవహారానికి లేఖలతో శుభం కార్డు పడింది. ‘బాలీవుడ్‌ వైవ్స్‌’ టైటిల్‌ విషయంలో ప్రముఖ నిర్మాతలు కరణ్‌ జోహార్‌, మధుర్‌ భండార్కర్‌ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. కాగా.. ఈ విషయంలో వెనక్కి తగ్గిన ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ క్షమాపణలు చెప్పారు. దీనిపై భండార్కర్‌ సైతం స్పందించారు. ఇవన్నీ ఇక్కడితో వదిలేద్దామని, ఇకపై కలిసి ముందుకువెళదామని ఆయన మరో బహిరంగ లేఖ రాశారు.

‘ప్రియమైన కరణ్‌జోహార్‌.. మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు. సినిమా పరిశ్రమలో పరస్పర గౌరవం, విశ్వాసం ఎంతో ముఖ్యం. 2013లో మీరు అడగ్గానే మీకు ‘గుట్కా’ అనే టైటిల్‌ ఇచ్చాను. ఈ టైటిల్‌ ఇవ్వడానికి ముందు నేను ఒక్క క్షణం కూడా వెనుకాడలేదు. అలాగే నేను తిరస్కరించినప్పుడు మీనుంచి అదే మర్యాదను నేనూ కోరుకుంటాను. కానీ.. ఈ విషయంలో అలా జరగలేదు. అందుకే నేను కాస్త ఇబ్బందిపడ్డాను. ఇప్పుడు.. మీ క్షమాపణను అంగీకరిస్తున్నాను. ఇవన్నీ ఇక్కడే వదిలేయాలనుకుంటున్నా. మీ భవిష్యత్ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని భండార్కర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

మధుర్‌ భండార్కర్‌ తన సినిమా కోసం రిజిస్టర్‌ చేసుకున్న ‘బాలీవుడ్‌ వైవ్స్‌’ అనే టైటిల్‌ను కరణ్‌జోహార్‌ తన రాబోయే వెబ్‌సిరీస్‌కు పెడుతున్నట్లు ప్రకటించారు. ఇది ఇద్దరి మధ్య వివాదానికి దారి తీసింది. టైటిల్‌ విషయంలో విరమించుకోవాలని భండార్కర్‌ విన్నవించినా కరణ్‌జోహార్‌ స్పందిచలేదు. దీంతో కరణ్‌పై భండార్కర్‌ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. ఈనెల 26న కరణ్‌జోహార్‌ క్షమాపణలు చెబుతూ.. ట్విటర్‌ వేదికగా భండార్కర్‌కు ఓ లేఖ పంపించారు.

ఇదీ చదవండి..

‘బాలీవుడ్‌ భార్యలు’ వివాదం సమాప్తం!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన