
తాజా వార్తలు
‘దయచేసి నా ప్రాజెక్ట్‌ను తక్కువగా చూడకండి’
కరణ్జోహార్కు ప్రముఖ దర్శకుడు ట్వీట్
ముంబయి: బాలీవుడ్ అగ్రనిర్మాత కరణ్ జోహార్, అపూర్వ మెహ్తా సంయుక్తంగా రూపొందిస్తున్న వెబ్ సిరీస్ ‘ఫాబ్యులెస్ లివ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్’. మహీప్ కపూర్, భావనా పాండే, సీమా ఖాన్, నీలమ్ కొఠారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. కాగా, తాను దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాకి ‘బాలీవుడ్ వైఫ్స్’ అనే పేరు రిజిస్టర్ చేయించుకున్నానని.. ఇప్పుడు ఆ టైటిల్‌ను కరణ్, అపూర్వ వాడుకున్నారని ఆరోపిస్తూ దర్శకుడు మధుర్ బండార్కర్ ట్వీట్ చేశారు.
‘ప్రియమైన కరణ్ జోహార్.. మీరు, అపూర్వమెహ్తా కలిసి రూపొందించనున్న ఓ వెబ్ సిరీస్ కోసం నేను రిజిస్టర్ చేయించుకున్న ‘బాలీవుడ్ వైఫ్స్’ టైటిల్ వాడుకుంటామని ఓ సందర్భంలో నన్ను అడిగారు. మీ అభ్యర్థనను అప్పుడే సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే నేను దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా కోసం ఆ టైటిల్ ఫిక్స్ చేశాను. ప్రస్తుతం నా సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ‘ఫాబ్యులెస్ లివ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్’లో ఇప్పుడు నా టైటిల్ వాడుకోవడం నైతికంగా తప్పు. దయచేసి నా ప్రాజెక్ట్‌ని తక్కువగా చూడకండి. అలాగే మీరు వెబ్ సిరీస్ టైటిల్ మార్చుకోగలరని ఆశిస్తున్నాను.’ అని ఫ్యాషన్ చిత్ర దర్శకుడు పేర్కొన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- స్వాగతం అదిరేలా..
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- డీఎం సాబ్.. నేను తేజస్వి మాట్లాడుతున్నా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
