close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 07/07/2020 23:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌ సహా 8 నగరాల్లో స్థిరాస్తి ధరల తగ్గుమఖం

ముంబయి: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో స్థిరాస్తి ధరలు ఐదు శాతం వరకు తగ్గాయని రియాల్టి పోర్టల్‌ మ్యాజిక్‌ బ్రిక్స్‌ తెలిపింది. కొవిడ్‌-19కు ముందున్న పరిస్థితితో పోలిస్తే ఆస్తుల శోధన 27% వరకు తగ్గిందని పేర్కొంది. తమ పోర్టల్‌లో నమోదయ్యే ప్రాపర్టీల సంఖ్య 42.5% పడిపోయిందని వెల్లడించింది.

‘2020, ఏప్రిల్‌లో అగ్రశ్రేణి ఎనిమిది నగరాల్లో స్థిరాస్తి ధరలు 2-9 శాతం తగ్గాయి. మొత్తంగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో టైర్‌-1 నగరాల్లో ఈ తగ్గుదల 1-5 శాతంగా ఉంది’ అని మ్యాజిక్‌ బ్రిక్స్‌ సీఈవో సుధీర్‌ పాయ్‌ అన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే ముంబయి కొంత మెరుగ్గా ఉందన్నారు. ఇక్కడ తగ్గుదల 0.4-0.8 శాతంగా ఉందన్నారు. దక్షిణాది నగరాల్లో ధరలు 3-5% తగ్గాయని పేర్కొన్నారు.

ధరలు తగ్గిన నగరాల్లో ఆకర్షణీయ డీల్స్‌ కోసం వెతికే వినియోగదారుల సంఖ్య అధికంగా ఉందని పాయ్‌ తెలిపారు. గతంతో పోలిస్తే ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో హైదరాబాద్‌లో ధరల తగ్గుదల 5.2 శాతంగా ఉందని పేర్కొన్నారు. బెంగళూరులో 2.8, చెన్నైలో 3.1, గురుగ్రామ్‌లో 0.4, గ్రేటర్‌ నోయిడాలో -0.2, దిల్లీలో -2.3, నవీ ముంబయిలో 0.4, థానెలో 0.6, ముంబయిలో 0.8, పుణెలో 1.6, కోల్‌కతాలో -1.3, అహ్మదాబాద్‌లో -3.5శాతం ధరలు తగ్గాయన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.