close

తాజా వార్తలు

‘ఆరే’ వివాదంలో కేసులు ఎత్తివేత

ముంబయి: ముంబయిలోని ఆరే కాలనీ చెట్ల నరికివేత అంశంలో పర్యావరణ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆరేకాలనీలో మెట్రో కార్‌ షెడ్‌ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన రెండు రోజులకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముంబయిలో ఆరేకాలనీలో మెట్రో కార్ల షెడ్డు నిర్మాణం కోసం గత ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు పర్యావరణ వేత్తలు, స్థానికులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో పలువురిని అరెస్ట్‌ చేసి కేసులు పెట్టారు. అనంతరం ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు సైతం చేరింది. కాగా తాజాగా ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ఉద్ధవ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.