మహారాష్ట్రలో ఒక్కరోజే 122 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 04/06/2020 09:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో ఒక్కరోజే 122 మంది మృతి

కొనసాగుతున్న కరోనా కేసులు, మరణాలు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కరాళనృత్యం చేస్తోంది. బుధవారం నిసర్గ తుపానుకు అతలాకుతలమైన ముంబయిలో 49 మంది వైరస్‌ కారణంగా మృతిచెందగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 122 మంది కన్నుమూశారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 2,587కి చేరింది. కేసుల సంఖ్య 74,860కి పెరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో మూడో వంతు ముంబయిలోనే నమోదుకావడం విషాదకరం. ఇక పుణెలో బుధవారం కొత్తగా 11 మంది మృతిచెందారు. అక్కడ ఒకే రోజు ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. ఇక్కడ మొత్తం మృతుల సంఖ్య 378గా నమోదైంది.  గడిచిన 24 గంటల్లో 996 మంది కొవిడ్‌ బారి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారని అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం బాధితుల్లో కోలుకున్న వారి సంఖ్య 32,329కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,935 యాక్టివ్‌ కేసులున్నాయని.. ఇప్పటివరకు మొత్తం 4,97,276 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని