
తాజా వార్తలు
థియేటర్లు తెరవగానే మహేశ్ చిత్రం రిలీజ్..!
రేసులో నితిన్, అల్లు అర్జున్
ఇంటర్నెట్‌డెస్క్: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో సినిమా రంగంలో సందడి తగ్గింది. అయితే అన్‌లాక్ నిబంధనల్లో భాగంగా అక్టోబర్ 15వ తేదీ నుంచి 50శాతం సీట్లను భర్తీ చేస్తూ సినిమాహాళ్లు తెరవడానికి చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో దాదాపు ఆరు నెలల తర్వాత ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు వచ్చే విధంగా లాక్‌డౌన్‌కి ముందు ప్రేక్షకుల్ని అలరించిన పలు సూపర్‌హిట్ చిత్రాలను మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నారు.
కాగా, థియేటర్లు ఓపెన్ కాగానే.. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్ విజయాన్ని అందుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’(తమిళ్‌డబ్బింగ్) చిత్రాన్ని చెన్నైలో మొదటి సినిమాగా ప్రదర్శించనున్నారు. మరోవైపు నితిన్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘భీష్మ’, అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘అల..వైకుంఠపురములో’ సినిమాలను సైతం బెంగళూరులోని పలు థియేటర్లలో స్ర్కీనింగ్ చేయనున్నారు. ఈ మేరకు ఆన్లైన్లో టికెట్ బుకింగ్‌లు కూడా ప్రారంభించారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పునఃప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- స్వాగతం అదిరేలా..
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- డీఎం సాబ్.. నేను తేజస్వి మాట్లాడుతున్నా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
