మహీంద్రా న్యూ‘థార్‌’కు రికార్డు స్థాయిలో బుకింగ్స్‌!
close

తాజా వార్తలు

Updated : 04/11/2020 20:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహీంద్రా న్యూ‘థార్‌’కు రికార్డు స్థాయిలో బుకింగ్స్‌!

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన కొత్త తరం ‘థార్‌’ మోడల్‌కు వినియోగదారుల నుంచి విశేషంగా స్పందన వస్తోంది. కారును మార్కెట్లోకి విడుదల చేసిన నెల రోజుల వ్యవధిలోనే దాని కోసం బుకింగ్స్‌ 20వేల మార్కును దాటాయని సంస్థ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడిచింది. ‘వినియోగదారుల నుంచి అధికంగా వస్తున్న స్పందన దృష్ట్యా వేరియంట్లను బట్టి కారు కోసం నిరీక్షించాల్సిన సమయం ఇప్పుడు 5 నుంచి 7 నెలల మధ్య ఉంటుందని పేర్కొంది. ఈ అపూర్వమైన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సంస్థ కార్ల ఉత్పత్తిలో వేగాన్ని పెంచినట్లు తెలిపింది. అంతేకాకుండా వినియోగదారులు కారు కోసం నిరీక్షించాల్సిన సమయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. 

మహీంద్రా సంస్థ డివిజన్‌ సీఈవో విజయ్‌ నక్రా మాట్లాడుతూ.. ‘కొత్త తరం థార్‌ మోడల్‌ కారుకు వచ్చిన అపూర్వమైన స్పందనకు మేం ఎంతో ఆనందిస్తున్నాం. వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన మా అంచనాలను అధిగమించింది. గతంలో నెలకు 2వేల వాహనాలు మాత్రమే ఉత్పత్తి చేయాలని మేం నిర్ణయించాం. కానీ ప్రస్తుతం అధిక డిమాండ్‌ దృష్ట్యా జనవరి కల్లా ఆ సంఖ్యను 3వేలకు పెంచాలని చూస్తున్నాం. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు వెయిటింగ్‌ పీరియడ్‌ను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. వినియోగదారులకు వాహనం ఎప్పటిలోగా డెలివరీ కావాలనే విషయమై సంప్రదించడానికి కంపెనీ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసింది. వారి వెయిటింగ్‌ పీరియడ్‌కు అనుగుణంగా భరోసా కల్పించి.. డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’ అని తెలిపారు.   

ఇదీ చదవండి

మార్కెట్లోకి మహీంద్రా కొత్త థార్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని