యూపీఐ పేమెంట్సా?.. వీటితో జాగ్రత్త!
close

తాజా వార్తలు

Updated : 20/05/2020 18:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీఐ పేమెంట్సా?.. వీటితో జాగ్రత్త!

ఇంటర్నెట్‌డెస్క్‌: యూపీఐ పేమెంట్స్‌ మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రభుత్వం ప్రోత్సహించడం, స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఒక్కరి చేతిలోకి అందుబాటులోకి రావడం ఇందుకు కారణం. కరోనా వైరస్‌ కారణంగా ఈ పేమెంట్స్‌ వాడకం మరింత ఎక్కువయ్యాయి. భౌతిక దూరం పాటించాలనే నిబంధన వల్ల వీటి వినియోగం భవిష్యత్‌లో సైతం పెరగనుంది. అయితే, ఇదే అదునుగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒక రూపంలో వల విసిరి అమాయకుల నుంచి డబ్బులు ఎత్తుకెళ్లిపోతున్నారు. కొందరు విద్యావంతులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు సైబర్‌, బ్యాంకింగ్‌ రంగ నిపుణులు.

* బ్యాంకు లింకులు పేరిట సందేశాలు పంపి డబ్బులు కాజేయడం ఇటీవల కాలంలో ఎక్కువ అయిపోయింది. మీ ఫోన్‌కు వచ్చే  లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయొద్దు. ఒకవేళ పొరపాటున క్లిక్‌ చేస్తే అవి మీ డిఫాల్ట్‌ యూపీఐ యాప్‌కు రీడైరెక్ట్‌ అవుతాయి. ఆటో డెబిట్‌కు పర్మిషన్‌ అడుగుతుంది. ఒకవేళ మీరు పొరపాటున ఇస్తే సైబర్‌ నేరగాళ్లు మీ ఖాతాలో నగదును క్షణాల్లో మాయం చేసేస్తారు.

* ఇటీవల కాలంలో కొందరు సైబర్‌ నేరగాళ్లు నేరుగా పేమెంట్స్‌కు సంబంధించిన ‘రిక్వెస్ట్‌ మనీ’ పేరిట లింకులను పంపుతున్నారు. ఆ లింకు క్లిక్‌ చేస్తే మనకు నగదు వస్తుందని భ్రమ పడి యూపీఐ పిన్‌ నంబర్‌ను ఇవ్వడం ద్వారా  రావడం మాట అటుంచితే ఖాతాలో మీ నగదు మాయం కావడం ఖాయం.

* బ్యాంక్‌ అధికారుల మాదిరిగా ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి వెరికేషన్‌ కోసం థర్డ్‌పార్టీ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. పొరపాటున మీరు ఆ యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే దొంగ చేతికి మీరే స్వయంగా తాళాలు అందించినట్లే. ఆ యాప్‌ మీరు డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీ ఫోన్‌ రిమోట్‌ యాక్సెస్‌ అవతలి వ్యక్తికి చేతికి వెళ్లిపోతుంది.

* ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించిన యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ డౌన్‌లోడ్‌ చేసుకున్నాక యాప్‌ అడిగిన పర్మిషన్లన్నీ ఇస్తే మీ ఫోన్లోని సమాచారం సైబర్‌ నేరగాడికి చిక్కుతుంది.

* బ్యాంకింగ్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు ఆయా బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఉత్తమం. బ్యాంకు యాప్‌లను పోలిన డూప్లికేట్‌ యాప్‌లు చాలానే ఉన్నాయి. అలాంటివి వాటికి దూరంగా ఉండడం ఉత్తమం.

* అలాగే ఆయా బ్యాంక్‌ సేవలకు సంబంధించిన కస్టమర్‌ కేర్‌ నంబర్లను నెట్టింట శోధించడం మంచిది కాదు. మీకు ఏ బ్యాంక్‌ నంబర్‌ కావాలో ఆ బ్యాంకు వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడి నంబర్‌కు ఫోన్‌ చేయడం మంచి పద్ధతి.

* యూపీఐ పిన్‌ గానీ, ఓటీపీ గానీ ఇంకో వ్యక్తికి చెప్పకుండా ఉండడం మంచిది.

ఇదీ చదవండి..
వాట్సప్‌ వీడియో కాలా? కొత్త నంబరా... జాగ్రత్త!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని