close

తాజా వార్తలు

Published : 12/05/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజకీయాలకు ఇది సమయం కాదు: మమత

దిల్లీ: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం ఓ పథకం ప్రకారం పనిచేస్తోందని.. రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు. కరోనా వైరస్‌ను తమ ప్రభుత్వం సమర్థంగానే ఎదుర్కొంటోందన్న ఆమె ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయొద్దని కోరారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దీదీ మాట్లాడారు. బెంగాల్‌కు అంతర్జాతీయ సరిహద్దులు, పెద్ద రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటంతో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. దేశ సమాఖ్య నిర్మాణాన్ని కూలదోయ వద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనాపై రాజకీయం చేస్తోందనీ.. రాష్ట్రాల మధ్య వివక్షతతో వ్యవహరిస్తోందని మమత ఆరోపించారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని