close

తాజా వార్తలు

Published : 25/08/2020 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నీట్‌, జేఈఈ మెయిన్స్‌ వాయిదా వేయండి

ప్రధాని మోదీని కోరిన మమత

కోల్‌కతా: కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నీట్‌, జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గతంలో పలు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ప్రధాని వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు గుర్తు చేశారు. కరోనా వల్ల ఏర్పడిన ఇబ్బందులు తొలగే వరకు ఈ పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులందరికీ సురక్షితమైన వాతావరణం కల్పించడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ ఆఖరి నాటికి విశ్వవిద్యాలయాలు/ కళాశాలల్లో పరీక్షలన్నీ పూర్తి చేయాలంటూ యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలతో విద్యార్థులు జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.  

ఇటీవల భాజపా ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి కూడా ఇదే అంశంపై ప్రధానికి లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే  దేశ వ్యాప్తంగా అధిక సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతారని హెచ్చరించారు. దీపావళి తర్వాత పరీక్షలు నిర్వహించేలా కేంద్ర విద్యాశాఖకు ఆదేశాలు జారీచేయాలని ప్రధానిని కోరిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని