సిబ్బందిపై కోపంతో.. ఆసుపత్రిపై ట్రక్కుతో దాడి 
close

తాజా వార్తలు

Published : 21/12/2020 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిబ్బందిపై కోపంతో.. ఆసుపత్రిపై ట్రక్కుతో దాడి 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసుపత్రి సిబ్బందితో వివాదం తలెత్తడంతో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. వైద్యశాల‌పై ట్రక్కుతో దాడికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల వైద్యం విషయంలో గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఆసుపత్రి సిబ్బందితో గొడవ పడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి పిక్‌అప్‌ ట్రక్‌తో ఆసుపత్రిపై దాడికి దిగాడు. గురుగ్రామ్‌లోని బాలాజీ ఆసుపత్రిపైకి ట్రక్కు తీసుకొచ్చి విచక్షణారహితంగా డ్రైవింగ్‌ చేశాడు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న మందుల దుకాణంతోపాటు పార్కింగ్‌ స్థలంలో ఉన్న దాదాపు 15 వాహనాలను ఢీకొట్టాడు. మనుషులను ఢీకొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ వారు తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

ఇద్దరు చిన్నారులను బలిగొన్న కంటైనర్‌

తప్పించుకునేలోపే.. ముంచుకొచ్చిన ముప్పుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని