బహుమతి ఇచ్చేందుకు దొంగతనం
close

తాజా వార్తలు

Updated : 18/11/2020 21:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బహుమతి ఇచ్చేందుకు దొంగతనం

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

దిల్లీ: పండుగ వేళ ఎవరికైనా బహుమతులు ఇవ్వాలనుకుంటే కొత్తవి కొనివ్వడం పరిపాటి. కానీ దొంగిలించిన వస్తువులను ఎవరైనా బహుమతిగా ఇవ్వాలనుకుంటారా..? దీపావళి వేళ అలాంటి దొంగతనం ఒకటి దిల్లీలోని సేవానగర్‌ ప్రాంతంలో జరిగింది. డీసీపీ అతుల్‌కుమార్‌ ఠాకూర్‌ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం శనివారం నాడు కోట్లాముబారక్‌పుర్‌ పోలీసు స్టేషన్‌కు ఓ ద్విచక్రవాహనం చోరీకి గురైందని ఫిర్యాదు అందింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్‌లో ఓ అనుమానాస్పద వ్యక్తి ఆ ద్విచక్రవాహనం వద్ద తచ్చాడుతూ కనిపించాడు. తర్వాత  దాన్ని తాపీగా దొంగిలించడం కనిపించింది.

సోమవారం నాడు ఆ వాహనాన్ని అమ్మకానికి పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందడంతో  పక్కా నిఘా ఉంచారు. నిందితుడు అక్కడికి చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కోట్లా ముబారక్‌పుర్‌ ప్రాంతంలోని ఓ దాబాలో పని చేస్తున్న శివశంకర్ ‌(25)గా గుర్తించారు. తన స్వస్థలమైన బిహార్‌లో సీతామర్హిలోని తన బంధువుకు దీపావళి బహుమతిగా పంపేందుకు ఆ వాహనం దొంగిలించానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని