
తాజా వార్తలు
ఆ నిర్మాత మానసికంగా వేధించాడు: మందనా
దుస్తులు మార్చుకుంటుంటే క్యారీవాన్‌లోకి వచ్చి..
ముంబయి: బాలీవుడ్లో తెరకెక్కిన పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు ఇరానీ నటి మందనా కరీమి. సన్నీలియోనీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కోకో కోలా’ చిత్రంలో ప్రస్తుతం మందనా నటిస్తున్నారు. చిత్ర నిర్మాత మహేంద్ర ధరివాల్ అతనని మానసికంగా వేధింపులకు గురిచేశాడని నటి మందనా ఆరోపణలు చేశారు. షెడ్యూల్ ప్రకారం కాకుండా ఇంకొంచెం ఎక్కువ సమయం సెట్లోనే ఉండమంటూ తనపై కేకలు వేశారని ఆమె అన్నారు.
‘‘కోకో కోలా’ చిత్రంలో ప్రస్తుతం నేను నటిస్తున్నాను. గతేడాది నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రబృందంతో మొదటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నిర్మాత మహేంద్ర పురుష పక్షపాతి. కోపం, అహంకారం ఎక్కువ. అయితే దీపావళి ముందురోజు రాత్రి ఈ సినిమాకి సంబంధించి నా షూటింగ్ చివరిరోజు. అదే రోజు నిర్మాత ప్రవర్తన చూసి నేనెంతగానో కంగారుపడ్డా. సీన్స్ ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయని.. కాబట్టి మరో గంట సెట్లోనే ఉండాలని నిర్మాత చెప్పారు. అయితే వేరే మీటింగ్స్ ఉండడం వల్ల నాకు కుదరదని సమాధానమిచ్చాను. దానికి ఆయన సరే అన్నారు. అనంతరం షూటింగ్ పూర్తి చేసుకుని దుస్తులు మార్చుకోవడానికి క్యారీవాన్‌లోకి వెళ్లాను. అలా నేను వెళ్లిన కొంత సమయానికే నిర్మాత నా క్యారీవాన్‌లోకి ప్రవేశించి నన్ను తిట్టడం ప్రారంభించారు.’
‘‘దుస్తులు మార్చుకోవాలి సర్.. బయట ఉండండి. వచ్చి మాట్లాడతాను.’ అని చెప్పినప్పటికీ ఆయన వినలేదు. ‘నువ్వు ఇప్పుడు వెళ్లడానికి వీల్లేదు. మరో గంట సెట్లో ఉండమని చెప్పాను కాబట్టి నువ్వు ఉండాలి. ఎందుకంటే నీకు డబ్బులు ఇచ్చిన నిర్మాతని నేను.’ అని గట్టిగా కేకలు వేశారు. ఆయన అరుపులు విని అక్కడ ఉన్నవారందరూ నన్ను ఇబ్బందిగా చూశారు. అందరి ముందు కేకలు వేసి ఆయన నన్ను మానసికంగా వేధింపులకు గురి చేశారు. సినీ పరిశ్రమలో నాకు గాడ్‌ఫాదర్ లేరు. ఒంటరి మహిళపై వేధింపులకు పాల్పడడం ఎంతవరకూ సమంజసం’ అని నటి ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
