close

తాజా వార్తలు

Updated : 08/11/2020 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోహ్లీ రెచ్చగొడితే.. పాండే సిక్స్‌ కొట్టాడు

నెట్టింట్లో వీడియో వైరల్‌.. 

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌తో తలపడిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో మనీష్‌ పాండేని స్లెడ్జింగ్‌ చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు కోహ్లీపై మండిపడుతున్నారు. గెలవక తప్పని మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 131/7 స్కో్‌ర్‌ సాధించగా అనంతరం హైదరాబాద్‌ 4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కెన్‌ విలియమ్సన్‌(50), జేసన్‌ హోల్డర్‌(24) చివరి వరకూ ఆజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. దాంతో వార్నర్‌ టీమ్‌ రెండో క్వాలిఫయర్‌కు దూసుకెళ్లింది.

అయితే, ఛేదనకు దిగిన హైదరాబాద్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ గోస్వామి(0) వికెట్‌ కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే సిరాజ్‌ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అతడు వెనుతిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీష్‌ పాండే(24)ను ఉద్దేశించి బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన మాటలతో కవ్వించాడు. మూడో ఓవర్‌లో సిరాజ్‌ బౌలింగ్‌ చేస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, రెండు బంతులు ఆడిన మనీష్‌ తర్వాత పడిన షార్ట్‌పిచ్‌ బంతిని మిడాఫ్‌ మీదుగా ఓ భారీ సిక్సర్‌ బాదాడు. దాంతో కోహ్లీకి సున్నింతంగానే తన ఉద్దేశం చాటిచెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. కోహ్లీ ప్రవర్తన సరిగా లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, లీగ్‌ దశలో కొద్ది రోజుల క్రితం ముంబయితో తలపడిన సందర్భంలోనూ బెంగళూరు సారథి ఇలాగే ప్రవర్తించాడు. సూర్యకుమార్‌ను స్లెడ్జింగ్‌ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని