close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 09/06/2020 17:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మారుతీ సుజుకీ ఎస్‌ప్రెస్సోపై ఆఫర్లు  

దిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీసుజుకీ కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ఆఫర్లను ప్రకటిస్తోంది. తన ‘ఎస్‌ప్రెస్సో’ రకం కారుపై రూ.48,000 తగ్గింపును ప్రకటించింది.  దీని ప్రకారం డీలర్‌ వద్ద కస్టమర్‌కు నేరుగా రూ.20వేల మేరకు క్యాష్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతోపాటు పాతవాహనానికి ఎక్స్‌ఛేంజి చేసి మరో రూ.20 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. వీటికి తోడు యాక్ససిరీస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ వంటివి మరికొన్ని కలిపి మరో రూ.8,000 వరకు వినియోగదారుడికి మిగలనుంది. ప్రస్తుతం మారుతీ సుజుకీ ఎస్‌-ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.69 లక్షల నుంచి టాప్‌ఎండ్‌ ధర రూ.4.91లక్షల వరకు ఉంది. 

ఈ కారును సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రతి నెల విక్రయాల్లో 10 వేల మేరకు పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో విదేశాలకు ఎగమతి కూడా ప్రారంభించారు. ముఖ్యంగా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఈ కారును ఎగుమతి చేస్తున్నారు. ఈ కారులో కంపెనీ 1.0లీటర్‌ కె10 ఇంజిన్‌ అమర్చారు. ఇది 67 బీహెచ్‌పీ శక్తివిడుదల చేస్తుంది..  5,500 ఆర్‌పీఎం వద్ద 90ఎన్‌ఎం టార్క్‌ విడుదలవుతుంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.