close

తాజా వార్తలు

2020లో ధరలు పెంచనున్న మారుతీ సుజుకీ

న్యూదిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ  వచ్చే ఏడాది నుంచి ధరలు పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ముడిసరకుల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. ఈ విషయాన్ని రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ‘‘ముడిసరకుల ధరల ప్రభావం కంపెనీ తయారు చేసే వాహనాలపై తీవ్రంగా పడనుంది. ఈ ప్రభావాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకోసమే జనవరి 2020 నుంచి వివిధ మోడళ్లపై ధరలను పెంచుతున్నాము’’ అని ఒక ప్రకటనలో తెలిపింది.  ఏ మోడళ్లపై ధరలు పెరగనున్నాయో మాత్రం ఈ ప్రకటనలో వెల్లడించలేదు. 
ఈ కంపెనీ తయారు చేసే ఆల్టో, ఎస్‌-ప్రెస్సో, వేగనార్‌, స్విఫ్ట్‌, సెలిరియో, డిజైర్‌, సియాజ్‌ దేశీయ విక్రయాలు గతవారం 3.2శాతం తగ్గాయి. కంపెనీ 1,41,400 వాహనాలను స్థానిక డీలర్లకు అందజేసింది. దీనికి అదనంగా టయోటాతో కలిసి గ్లాన్జా మోడల్‌కు చెందిన 2286 వాహనాలను విక్రయించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.