close

తాజా వార్తలు

Published : 28/11/2020 22:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నెట్‌ఫ్లిక్స్‌లో ‘మాస్టర్‌’ రిలీజ్‌..?

షాక్‌లో అభిమానులు

చెన్నై: విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్‌ ‘మాస్టర్‌’. లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మాస్టర్‌’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో చిత్రవర్గాల నుంచి సమాచారం వచ్చినప్పటికీ ఓటీటీలో విడుదల చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వస్తున్న పలు కథనాలు సినీ ప్రియుల్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

‘మాస్టర్‌’ సినిమా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదల కానుందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సదరు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వాళ్లు.. ‘మాస్టర్‌’ డిజిటల్‌ హక్కులను అధిక మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని సమాచారం. కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితుల రీత్యా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉండడంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే ‘మాస్టర్‌’ విడుదలపై చిత్రబృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని