close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 13/05/2020 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌ నుంచి పాక్‌కు ఔషధాలు

విచారణకు ఆదేశించిన ఇమ్రాన్‌ఖాన్‌

ఇస్లామాబాద్‌: భారత్‌ నుంచి 450 ప్రాణాధార ఔషధాలు అక్రమంగా దిగుమతి అయ్యాయన్న ఆరోపణలపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విచారణకు ఆదేశించారు. భారత్‌ ఆర్టికల్‌-370ని రద్దు చేసిన అయితే కరోనా కారణంగా ప్రాణాధార ఔషధాలకు కొరత ఏర్పడటంతో... వాటితో పాటు మందుల తయారీకి అవసరమైన ముడిసరకును భారత్‌ నుంచి దిగుమతికి చేసుకునేందుకు అనుమతించింది. ఈ సడలింపును సాకుగా చేసుకుని భారత్‌ నుంచి విటమన్‌ మాత్రల వంటి ఔషధాలు దిగుమతి అవుతున్నాయంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై విపక్షాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇమ్రాన్‌ దర్యాప్తునకు ఆదేశించారు. కాగా... విదేశాల నుంచి తిరిగివచ్చే పాకిస్థానీయుల క్వారంటైన్‌ సమయాన్ని ప్రభుత్వం 48 గంటలకు కుదించింది. పరీక్షల్లో వారికి కరోనా లేదని తేలితే, ఆ సమయం తర్వాత వారిని ఇళ్లకు పంపేస్తారు. లేదంటే ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తారు. పాక్‌లో కొత్తగా 1,733 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 32,674కు చేరింది. ఇప్పటివరకూ ఇక్కడ 724 మంది కరోనా కారణంగా మృతిచెందారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.