భార్యతో సుధాకర్‌ డ్యాన్స్‌.. చిరు ఫిదా!
close

తాజా వార్తలు

Published : 28/08/2020 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార్యతో సుధాకర్‌ డ్యాన్స్‌.. చిరు ఫిదా!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’, ‘నువ్వు తోపురా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సుధాకర్‌ కొమ్మాకుల. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సుధాకర్‌ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సుధాకర్‌, తన భార్యతో కలిసి చిరు పాటకు డ్యాన్స్‌ చేసి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘ఛాలెంజ్‌’ సినిమాలోని ‘ఇందువదన.. కుందరదన’ అంటూ సాగే పాటకు చిరు-విజయశాంతి అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. ఇప్పుడే అదే పాటను సుధాకర్‌ తన భార్య హారికతో కలిసి డ్యాన్‌ చేశారు. ఈ వీడియోను చూసిన చిరంజీవి సుధాకర్‌ను అభినందిస్తూ ఆడియో సందేశాన్ని పంపారు.

‘‘హాయ్‌ సుధాకర్‌.. హారిక ఎలా ఉన్నారు. నా పుట్టినరోజున మీరు ఇచ్చిన విజువల్‌ ట్రీట్‌కు ధన్యవాదాలు. బ్యూటిఫుల్‌ గిఫ్ట్‌. ఆ పాట చూస్తున్నంతసేపూ నా గత స్మృతులు ‘ఛాలెంజ్‌’ డేస్‌ గుర్తుకు రావడం ఒక ఎత్తయితే, మీరు ఆ పాటకు డ్యాన్స్‌ను రీప్రొడ్యూస్‌ చేయాలన్న ఆలోచన దగ్గర నుంచి ప్రాక్టీసు చేయడం, షూట్‌ చేయడం, నాకు పంపించాలన్న ప్రయత్నం ఇవన్నీ మీరు ఊహించని దానికన్నా నన్ను ఎక్కువగా సంతోషింపజేశాయి. మీరు ఇండియాలో ఉంటే నా సంతోషాన్ని ఇంకోలా తెలిపేవాడినేమో. ఎక్కడో అమెరికాలో దూరంగా ఉన్నారు కాబట్టి, ఎలా తెలపాలో తెలియక మీ దంపతులకు నా వాయిస్‌ మెస్సేజ్‌ పంపుతున్నా.. సుధాకర్‌ నువ్వు సినిమా హీరోవి డ్యాన్స్‌ చేస్తావు. కాబట్టి అది ఊహించగలం. హారిక ఒక టెకీ. తను సినిమాకు సంబంధం లేని అమ్మాయి అయి ఉండి, అంత చక్కగా డ్యాన్స్‌ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తన గ్రేస్‌, స్టైల్‌కు కొంచెం ఎక్కువ మార్కులు వేస్తున్నా ఏమీ అనుకోకు. బహుశా నీ ట్రైనింగ్‌ అయి ఉంటుంది. మీ దంపతులు ఎలాగైతే చక్కగా డ్యాన్స్‌ చేసి రక్తి కట్టించారో, అలాంటి సమన్వయంతో జీవితంలో  కూడా ‘లైఫ్ ఈజ్‌ బ్యూటి ఫుల్‌’ అనేలా కొనసాగించాలని నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అంటూ చిరు ఆడియో సందేశాన్ని పంచుకున్నారు.

తమ పాటకు చిరు స్పందనతో సుధాకర్‌ దంపతులు ఆనందపడిపోయారు. థ్యాంక్యూ మెగాస్టార్‌ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని