
తాజా వార్తలు
రెస్టారెంట్ రంగ సమస్యలపై ఆర్థిక మంత్రితో చర్చించాం
ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు అనురాగ్ కత్రియార్
దిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా రెస్టారెంట్లపై భారీగా ప్రభావం పడిందని, ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తమ ప్రతినిధులు వివరించారని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) తెలిపింది. నలుగురు సభ్యులతో కూడిన దౌత్య బృందం ఆర్థిక మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ సమస్యలపై చర్చించిందని వెల్లడించింది. విధానపరమైన నిర్ణయాలు, నగదు లభ్యత మద్దతు వంటి అంశాలను వివరించామని, ఎన్ఆర్ఏఐ సూచించిన చర్యలు ఖజానాపై ఎటువంటి భారం చూపవని వివరించినట్లు తెలిపింది. రెస్టారెంట్ల రంగం అత్యంత గడ్డుకాలంలో ఉందని, ఈ దశను అధిగమించడానికి ప్రభుత్వం వెంటనే సహాయ సహకారాలు అందించాలని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు అనురాగ్ కత్రియార్ కోరారు. ఆర్థిక మంత్రి వీటిపై సానుకూలంగా స్పందించారని, వచ్చే సమావేశంలో మరిన్ని వివరాలు అందిస్తామని వెల్లడించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
- భలే పంత్ రోజు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
