ధోనీ, కోహ్లీ తర్వాత హార్దిక్‌ పాండ్యనే..
close

తాజా వార్తలు

Updated : 07/12/2020 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధోనీ, కోహ్లీ తర్వాత హార్దిక్‌ పాండ్యనే..

గ్లోబల్‌ స్టార్‌ అవుతాడు: మైఖేల్‌ వాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య వచ్చే మూడేళ్లలో గ్లోబల్‌ స్టార్‌గా ఎదుగుతాడని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ముంబయి క్రికెటర్‌ ఇటీవల ఐపీఎల్‌లో మంచి ప్రదర్శ చేసిన సంగతి తెలిసిందే. దాన్ని అలాగే కొనసాగిస్తూ ఆస్ట్రేలియా పర్యటనలోనూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు తొలి వన్డేలో 90, మూడో వన్డేలో 92*, రెండో టీ20లో 44* పరుగులు చేసి జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాడు. అందరి చేతా ప్రశంసలు పొందుతున్నాడు. వచ్చే మూడేళ్లలో అతడిలాగే కొనసాగితే కచ్చితంగా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ, ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడని చెప్పాడు. 

‘రాబోయే మూడేళ్లలో భారత్‌లో టీ20 ప్రపంచకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. అలాగే ఐపీఎల్‌ కూడా స్వదేశంలోనే జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో  పాండ్య రాణించడానికి, గ్లోబల్‌ స్టార్‌గా ఎదగడానికి మంచి అవకాశం దొరికింది’ అని వాన్‌ క్రిక్‌బజ్‌తో పేర్కొన్నాడు. కాగా, ఆదివారం రెండో టీ20 పూర్తికాగానే ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ సైతం టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంతకుముందు మ్యాచ్‌ ఫినీషర్‌గా ధోనీ సేవలందించనట్లుగా ఇప్పుడు పాండ్య ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడని మెచ్చుకున్నాడు. ఇక వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా ఆండ్రూ రసెల్‌ కన్నా పాండ్యనే ఉత్తమం అని కొనియాడాడు. 

ఇవీ చదవండి..

ఏడాదిగా కోహ్లీసేన జైత్రయాత్ర.. 

టీమిండియాలోకి మరో ధోనీ వచ్చాడు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని