కోహ్లీ బ్యాటింగ్‌ అంటే నా కుమారుడికి ఇష్టం
close

తాజా వార్తలు

Published : 02/12/2020 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ బ్యాటింగ్‌ అంటే నా కుమారుడికి ఇష్టం

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ అంటే తన కుమారుడికి ఎంతో ఇష్టమని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ చెప్పాడు. కోహ్లీ బ్యాటింగ్‌ చేయడానికి మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి తనని నిద్రలేపమని కోరతాడని తెలిపాడు. అతడు ఔటయ్యాక మళ్లీ తన గదిలోకెళ్లి వేరే పని చేసుకుంటాడని వివరించాడు. తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన వాన్‌.. కోహ్లీపై తన కుమారుడికి ఉన్న ఇష్టాన్ని ఇలా వివరించాడు. టీమ్‌ఇండియా సారథి ఈ దశాబ్దంలోనే గొప్ప ఆటగాడని, అతడు శ్రమ తీసుకోకుండా ఆడే షాట్లు అమోఘంగా ఉంటాయని మెచ్చుకున్నాడు.

అలాగే కోహ్లీ బ్యాటింగ్‌ విషయంలో తాను ఎలాంటి ఆందోళన చెందనని, అతడెలా ఆడినా అభ్యంతరం లేదని అభిప్రాయపడ్డాడు. అయితే, అతడు లేకుండా ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడబోయే మూడు టెస్టుల గురించే తాను ఆలోచిస్తున్నట్లు వాన్‌ చెప్పాడు. కెప్టెన్‌ లేకుండా ఇతరులు టీమ్‌ఇండియాను గెలిపించే పరిస్థితులు లేవని సందేహం వ్యక్తం చేశాడు. కోహ్లీ అంత ముఖ్యమైన ఆటగాడని తెలిపాడు. అతడొక్కసారి శతకం బాదితే వరుసగా మూడు, నాలుగు సాధిస్తాడని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, కోహ్లీ ఏడాది కాలంగా ఒక్క శతకం కూడా సాధించకపోవడం తెలిసిన సంగతే. గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో ఆడిన ఏకైక డే/నైట్‌ టెస్టులోనే చివరిసారి అతడు మూడంకెల స్కోర్‌ అందుకున్నాడు. ఇక మూడో వన్డేలోనైనా చెలరేగి అభిమానులను అలరిస్తాడో లేదో చూడాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని