close

తాజా వార్తలు

Published : 07/04/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆందోళనలో సూక్ష్మ రుణ సంస్థలు

కోల్‌కతా: ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో కార్యకలాపాలను నిలిపివేసిన సూక్ష్మ రుణ సంస్థలు(ఎమ్‌ఎఫ్‌ఐ) సమీప భవిష్యత్‌లో వృద్ధిపై ఆందోళన చెందుతున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలను రక్షించడంపైనే దృష్టి సారిస్తున్నట్లు ఎమ్‌ఎఫ్‌ఐలు చెబుతున్నాయి. చాలా వరకు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశమూ ఉందని మైక్రోఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ నెట్‌వర్క్‌(ఎమ్‌ఎఫ్‌ఐఎన్‌) ఛైర్‌పర్సన్‌ మనోజ్‌ కుమర్‌ నంబియార్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ఎపుడు ఎత్తేస్తారన్నదానిపై ఆధారపడి ఎమ్‌ఎఫ్‌ఐల పనితీరు ఆధారపడి ఉంటుందని ఆయన అంటున్నారు. తొలి త్రైమాసికంలో మాత్రం ప్రభావం కచ్చితంగా కనిపిస్తుందని.. మారటోరియం వల్ల ఏప్రిల్‌, మేలో వసూళ్లు తగ్గవచ్చని చెబుతున్నారు. విస్తరణ ప్రణాళికలను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయొచ్చని అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
సినిమా
క్రైమ్
క్రీడలు
పాలిటిక్స్
జనరల్