
తాజా వార్తలు
హైదరాబాద్‌పై సర్జికల్‌స్ట్రైక్స్ చేస్తారా?:కేటీఆర్
హైదరాబాద్: కొన్ని ఓట్లు, సీట్ల కోసం భాజపా నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపా మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? అని నిలదీశారు. కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. తన సహచర ఎంపీ బండి సంజయ్ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇవీ చదవండి..
ఎన్నికల వేళ ప్రతిపక్షాల విన్యాసాలు: కేటీఆర్
ఐదేళ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటి?:అర్వింద్
Tags :
జిల్లా వార్తలు