close

తాజా వార్తలు

Published : 27/10/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాత అంచనాలతో పోలవరం నిర్మించలేం: అనిల్‌

అమరావతి: పోలవరానికి ప్రస్తుతం కేంద్రం ఇస్తామంటున్న నిధుల గురించి కేంద్ర కేబినెట్‌ గతంలోనే స్పష్టతనిచ్చిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. అప్పట్లో కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ విషయంపై తీర్మానం చేసినా.. తెదేపా ప్రశ్నించలేదని ఆరోపించారు. సోమవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. 2013-14 తర్వాత ప్రాజెక్టు వ్యయం, భూమి విస్తీర్ణం పెరిగినా ఒప్పుకున్న మొత్తానికి ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించబోమని కేంద్రం తెదేపా ప్రభుత్వానికి స్పష్టం చేసిందని తెలిపారు. అప్పట్లో భాజపాతో కలిసి ఉన్నప్పటికీ తెదేపా కేంద్రాన్ని ప్రశ్నించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. 

పోలవరం కోసం ఖర్చు చేసిన రూ.2,200 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, ఖర్చు చేసిన నిధులు కోరితే ఆర్థిక శాఖ కొత్త అంశం లేవనెత్తిందని అనిల్‌ కుమార్‌ అన్నారు. ‘‘ 2014-16 వరకు కేవలం రూ.265 కోట్లు విలువైన పనులే చేశారు. 2014 వరకు ఉన్న ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పింది. 2014 అంచనాలు ఆమోదించి నిధులు ఇవ్వాలని చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. పాత అంచనాలతో నిర్మాణం చేపట్టడానికి మేము సిద్ధంగా లేము. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే, దానిపై పోరాటం చేస్తాం. రూ.30 వేల కోట్లు వ్యత్యాసం ఉంటే ప్రాజెక్టు ఎలా పూర్తి చేయగలం? పునరావాస పరిహార ప్యాకేజీ కోసమే రూ.30 వేల కోట్లు అవుతుంది. కేంద్రం జల సంఘం అంగీకరించిన మొత్తాన్ని ఇవ్వాల్సిందే’’ అని అనిల్‌కుమార్‌ అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని