‘జగన్‌ భక్తుడిని.. ఆయన్ను ఏమైనా అంటే..’
close

తాజా వార్తలు

Updated : 07/02/2020 19:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జగన్‌ భక్తుడిని.. ఆయన్ను ఏమైనా అంటే..’

చంద్రబాబుపై మంత్రి అనిల్‌ తీవ్ర వ్యాఖ్యలు

కర్నూలు: తెదేపా అధినేత చంద్రబాబుకు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సీఎం జగన్‌ దయాగుణం వల్లే ఇంకా ఆయన తిరగగలుగుతున్నారని చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాలలో గాంధీ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను జగన్‌ భక్తుడినని.. ఆయన్ను ఏమైనా అంటే ఊరుకునేది లేదన్నారు. జగన్‌ మూడో నేత్రం తెరిస్తే భస్మం అవుతారంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ‘‘మంత్రి కంటే ముందు మేం జగన్‌ అనుచరులం.. భక్తులం. మంత్రి పదవి ఉంటుంది..ఊడుతుంది. దాని గురించి ఎప్పుడూ మేం భయపడం. కానీ జగన్‌ అనుచరులం.. భక్తులం అనేదే మాకు అన్నిటికంటే ఎక్కువ. అదే మాకు శాశ్వతం’’ అని అనిల్‌ వ్యాఖ్యానించారు.

 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని