ఎంఆర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్య మూసివేత
close

తాజా వార్తలు

Updated : 27/10/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంఆర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్య మూసివేత

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్న మంత్రి బొత్స

విజయనగరం: విజయనగరంలో మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఆర్‌ కళాశాలలో ఇంటర్ విద్య మూసివేతకు రంగం సిద్ధమైంది. ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తూ ప్రకటన సైతం చేసింది. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డుతో పాటు ప్రభుత్వానికి మాన్సాస్‌ ట్రస్టు పాలకవర్గం తెలియజేసింది.  ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. దీనికి ప్రత్యామ్నాయంగా విజయనగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్‌, ఇంటర్ బోర్డు అధికారులతో కలిసి కళాశాలలో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య, ఖాళీలు, అధ్యాపకుల ఆవశ్యకత తదితర వివరాలను మంత్రి తెలుసుకున్నారు. 

అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ 
ఎమ్ఆర్ కళాశాలలో ఇంటర్ విద్యను మూసివేస్తున్నట్లు మాన్సాస్ ట్రస్టు ప్రభుత్వానికి తెలియజేసిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు నష్టపోకుండా విజయనగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మాన్సాస్ వివాదాలపై మంత్రి స్పందిస్తూ.. అవి కుటుంబ తగాదాలన్నారు. ఆ విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు. ఆస్తులు అన్యాక్రాంతం జరిగితే కచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని మంత్రి బొత్స తెలిపారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని