వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొందాం: ఈటల 
close

తాజా వార్తలు

Updated : 28/07/2020 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొందాం: ఈటల 

వరంగల్‌: కరోనా మహమ్మారి యావత్‌ మానవాళికి పెనుసవాల్‌గా మారి కంటిమీద కునుకులేకుండా చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కొవిడ్‌ నివారణ పెను సవాల్‌గా మారిందని తెలిపారు. వరంగల్‌లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి ఉమ్మడి జిల్లాలో కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ... కరోనా బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచి వారికి మరింత సేవలందించాలని అన్నారు. కరోనా వైరస్‌ను సకాలంలో గుర్తించని వారికే ఇబ్బందులొస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 81 శాతం మంది కొవిడ్‌ లక్షణాలు లేకుండానే కోలుకుంటున్నారన్నారు. అయితే, వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అనేక రకాల వ్యాధులను ఎదుర్కొన్న సత్తా మనకుందని.. ఈ వైరస్‌ను కూడా ధైర్యంగా ఎదుర్కొందామని ఈటల పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ... ఈ కష్టకాలాన్ని ఓ సవాల్‌గా తీసుకుని పనిచేయాలన్నారు. నిధులకు కొరత లేదని ఆసుపత్రిలో సౌకర్యాల పెంపు కోసమే అధికంగా ఖర్చు చేయాలని సీఎం ఆదేశించినట్లు ఎర్రబెల్లి తెలిపారు. అన్ని రకాల ఇబ్బందులను అధిగమించి పనిచేయాలని వైద్యులను ఆయన కోరారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, ఎంపీలు బండ ప్రకాశ్‌, కవిత, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నన్నపనేని నరేందర్‌, సీతక్క తదితరులు పాల్గొన్నారు.   Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని