close

తాజా వార్తలు

Updated : 26/11/2020 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరేళ్లలో హైదరాబాద్‌కు ఏంచేశారు?:కేటీఆర్‌

హైదరాబాద్‌: మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకోవడానికి భాజపా ప్రయత్నిస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు 12 మంది కేంద్రమంత్రులు, ఒక ముఖ్యమంత్రి వస్తున్నారని.. సింహం మాత్రం సింగిల్‌గానే వెళ్తోందని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్‌ పరిధిలో మల్లాపూర్‌, చిలుకానగర్‌ చౌరస్తాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో కేటీఆర్‌ మాట్లాడారు. ప్రజల దయ ఉన్నన్నాళ్లు కేసీఆర్‌ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌కు ఏం చేశారని భాజపా నేతలను ప్రజలు ప్రశ్నించాలన్నారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు. జన్‌ధన్‌ ఖాతాలు తెరవాలని మోదీ చెప్పారని.. ఆయన పంపిన రూ.15లక్షలు ఎవరికైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. రూ.15లక్షలు తీసుకున్నోళ్లు భాజపాకు మిగిలిన వారు తెరాసకు ఓటేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

వారికి చెవిలో పువ్వు పెట్టడం తప్ప ఏమీ తెలీదు

గతలో ఉప్పల్‌ ప్రాంతంలో మంచినీటికి ఇబ్బంది ఉండేదని.. తెరాస ప్రభుత్వ వచ్చాక ఉప్పల్‌, కాప్రా,మల్కాజిగిరిలో రూ.2వేల కోట్లతో పైపులు వేసి నల్లాల ద్వారా నీరు అందిస్తాంచామన్నారు. దాదాపుగా ఈ సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. 1920లో నిర్మించిన గండిపేట చెరువు తర్వాత హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు ఏ ప్రభుత్వమూ చర్యలు చేపట్టలేదని.. తాము కేశవాపూర్‌లో రిజర్వాయర్‌ నిర్మాణం చేపడుతున్నామన్నారు. పేదలు 20వేల లీటర్ల వరకు శాశ్వతంగా మంచినీటి బిల్లు కట్టే అవసరం లేకుండా చేశామన్నారు. తెరాస పాలనలో అల్లర్లు, కర్ఫ్యూ లేవని.. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందని చెప్పారు. హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉంటున్నామన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మాత్రమే బాకీ ఉన్నామని.. అవి కూడా తామే ఇస్తామని పునరుద్ఘాటించారు. పంచాయితీలతో తల్లడిల్లే హైదరాబాద్‌ కావాలా? పచ్చని పొదరిల్లులాంటి హైదరాబాద్‌ కావాలా? అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు. చెవిలో పువ్వు పెట్టడం, మొండి చేయి చూపడం తప్ప భాజపాకు ఏమీ తెలీదని కేటీఆర్‌ విమర్శించారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన