
తాజా వార్తలు
‘హైదరాబాద్ గులాబీలా?గుజరాత్ గులాములా?’
హైదరాబాద్: మతంపేరుతో హైదరాబాద్‌లో చిచ్చుపెడుతున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వరద బాధితులకు రూ.10వేలు రాకుండా ఆపినోళ్లు రూ.25 వేలు ఇస్తారా? అని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్‌నగర్‌లోని ఎన్టీఆర్ నగర్లో నిర్వహించిన తెరాస రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, భాజపా తీరుపై మండిపడ్డారు. వరదలు వచ్చిన నాలుగు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం బెంగళూరుకు రూ.669కోట్లు, గుజరాత్‌కు రూ.500కోట్లు ఇచ్చిందని.. తెలంగాణ ఏం అన్యాయం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ, హైదరాబాద్ దేశంలో లేవా?అని నిలదీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అర్హులైన వరద బాధితులందరికీ సాయం పంపిణీని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఏనాడైనా ఘర్షణలు జరిగాయా?
ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎలాంటి పరిస్థితి ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలని ప్రజలను కేటీఆర్ కోరారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ కోతలు ఉంటాయని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నో విష ప్రచారాలు చేశారని ఆరోపించారు. గతంలో పవర్ హాలిడేలు, పారిశ్రామిక వేత్తలు ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేసే పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు పరిశ్రమలు, ఇళ్లకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. గత ఆరేళ్లలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టామని కేటీఆర్ వివరించారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏనాడైనా హిందూ ముస్లిం ఘర్షణలు జరిగాయా? అని ప్రశ్నించారు. నగర వ్యాప్తంగా 5లక్షలకు పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని.. ప్రజలకు పూర్తిస్తాయిలో రక్షణ కల్పించేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్‌కు అమెజాన్, యాపిల్, ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు వచ్చాయంటే దానికి కారణం.. దమ్మున సీఎం కేసీఆర్, నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉండటమేనని చెప్పారు.
తెలంగాణలాంటి రాష్ట్రాలు దేశాన్ని సాకుతున్నాయి
కరోనా వచ్చినా వరదలు వచ్చినా ప్రజల మధ్యే ఉన్నామని కేటీఆర్ అన్నారు. కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చి ఆరేళ్లయిందని.. తెలంగాణకు అరపైసా పని అయినా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ గులాబీలు కావాలా? గుజరాత్ గులాంలు కావాలా? ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ ఆరేళ్లలో మేమేం చేశామో గంటపాటు చెప్పగలనన్నారు. ఆరేళ్లలో కేంద్రానికి తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు రూ.2.72లక్షల కోట్లని.. కేంద్రం ఇచ్చింది రూ.1.40లక్షల కోట్లు మాత్రమేనన్నారు. తెలంగాణలాంటి ఐదారు రాష్ట్రాలు దేశాన్ని సాకుతున్నాయని చెప్పారు. వెనుకబడిన రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ఇక్కడి సొమ్ముతోనేనన్నారు. తాను చెప్పిన లెక్కలు తప్పయితే ఏ శిక్షకైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఓట్లకోసం భాజపా నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని ఆరోపించారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- కొవిడ్ టీకా అలజడి
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- అందరివాడిని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
