
తాజా వార్తలు
ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు ముఖ్యం: కేటీఆర్
హైదరాబాద్: మతం అడ్డుపెట్టుకుని చేసే చిల్లర వ్యవహారాలను ప్రజలు నమ్మొద్దని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘మనకు ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు ముఖ్యం. మతం కాదు.. జనహితం ముఖ్యం’’ అని వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్‌పేట పరిధిలోని చే నంబర్, రాంనగర్ చౌరస్తా్ల్లో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. సర్జికల్ స్ట్రైక్ అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. భాజపా నేతలు దేశంలోని పేదరికం, నిరుద్యోగంపై సర్జికల్ స్ట్రైక్ చేయాలన్నారు. మీ డొల్ల మాటలకు ఆగమాగం కాబోమన్నారు. సోమ్ము మనది.. సోకు వాళ్లదని భాజపాను ఉద్దేశించి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
‘‘కిషన్‌రెడ్డి గారూ సవాల్ చేస్తున్నా.. ఈ ఆరేళ్లలో రాజ్యాంగబద్ధంగా రావాల్సిన దానికంటే అంబర్‌పేటకు అదనంగా ఒక్కరూపాయైనా తెచ్చారా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. మీరు చేసిందేంటో చెప్పకుండా బుకాయించి ఏదో చెప్పి డ్రామా చేస్తామంటే కుదరదన్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తామో చెప్పకుండా భాజపా నేతలు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. నాలుగు ఓట్ల కోసం ఇంత చిల్లర రాజకీయమా అని ప్రశ్నించారు. ప్రజలంతా ఆలోచించాలని.. ఆగమాగం కావొద్దని హితవు పలికారు. భాజపాతో ఏమీ కాదని.. తెరాస అభ్యర్థులను గెలిపించాలని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి..
ఎన్నికల వేళ ప్రతిపక్షాల విన్యాసాలు: కేటీఆర్
ఐదేళ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటి?:అర్వింద్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- కల లాంటిది.. నిజమైనది
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- భలే పంత్ రోజు..
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ప్రేమోన్మాది ఘాతుకానికి.. యువతి బలి
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- కష్టాలను దాటి.. మేటిగా ఎదిగి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
