close

తాజా వార్తలు

Updated : 26/11/2020 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోం: కేటీఆర్‌

హైదరాబాద్‌: మత విద్వేషాలు రెచ్చగొడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఈనెల 28న జరగనున్న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నేతలకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు వస్తూ పోతుంటాయని.. కానీ నగరంలో శాంతియుత వాతావరణం ఉండే చూడటం ప్రభుత్వం బాధ్యతన్నారు. ప్రభుత్వం నడుపుతున్న తమకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని చెప్పారు. మతపరమైన అంశాలతో అశాంతిని నెలకొల్పాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతి అని.. వారి పట్ల తన నిబద్ధతను ఇప్పటికే చాటుకున్నారని వివరించారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన