
తాజా వార్తలు
కేంద్రం ప్యాకేజీ ఎవరికైనా అందిందా?: కేటీఆర్
హైదరాబాద్: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు తెలంగాణలో అభివృద్ధి బాగుందని కొనియాడి.. ఎన్నికల సయమంలో వచ్చి ఎలాంటి అభివృద్ధి లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం బేగంపేట మ్యారీగోల్డ్ హోటల్లో అగర్వాల్, మహేశ్వరి, మార్వాడి, గుజరాతీ వ్యాపారవేత్తలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు స్థానిక ఎన్నికలని.. ప్రచారంలో భాగంగా ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా విద్వేషాలు రెచ్చగొడున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అలజడి రేపాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ప్రశాంతత దెబ్బతింటే అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుందన్నారు.
కరోనా సమయంలో మోదీ ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించిందని, అది ఎవరికైనా అందిందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఫలాలు ఎవరికీ అందలేదన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నట్లు భాజపా ఆరోపిస్తోందని.. అలాగైతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. స్థానిక సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే భాజపా ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. గల్లీస్థాయి ఎన్నికల కోసం దిల్లీ స్థాయి నేతలంతా క్యూ కడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
